
చంద్రబాబు వచ్చారు.. వెళ్లారు
- మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయిన టీడీపీ అధినేత
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు నానా హడావుడి చేసిన చంద్రబాబు రెండ్రోజులు కూడా గడవకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఉండవల్లి నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆయన రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 25న ఎల్‌జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికి వచ్చేందుకు చంద్రబాబు డీజీపీ అనుమతి కోరారు.
ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చేందుకు డీజీపీ అనుమతిచ్చారు. కానీ, ఆ రోజు రాష్ట్రంలో ప్రారంభం కావాల్సిన విమాన ప్రయాణాలన్నీ రద్దుకావడంతో బాబు విశాఖకు వెళ్లకుండా రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. వచ్చిన తర్వాతైనా విశాఖ వెళ్లే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదు. రెండ్రోజులపాటు ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించారు. అది ముగిసిన తర్వాతైనా విశాఖ వెళ్తారని పార్టీ నాయకులు భావించారు. కానీ, అనూహ్యంగా అది ముగిసిన మర్నాడే చంద్రబాబు సైలెంట్‌గా హైదరాబాద్ వెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.