https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/fffff.jpg?itok=8zfnzHdh

45 మంది పోలీసులు కోలుకున్నారు



సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా బారిన పడిన 45 మంది పోలీసులు పూర్తిగా కోలుకున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. లాక్‌డౌన్‌లో ఏపీ పోలీస్‌ పాత్రపై మీడియాకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే.. 

► పోలీస్‌ సిబ్బందికి కావాల్సిన మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు అందిస్తూ, రెడ్‌జోన్‌లలో విధులు నిర్వహిస్తున్న వారికి పీపీఈ కిట్లను అందించాం.  
► 55 ఏళ్లు పైబడిన వారిని, ఆరోగ్య సమస్యలున్న సిబ్బందిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాం. రాష్ట్రంలో కోవిడ్‌ విధులు నిర్వహిస్తున్న 45 మంది పోలీస్‌ సిబ్బందికి కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడంతో వారికి వైద్య చికిత్సలు అందించి కోలుకునేలా చేశాం. తగిన జాగ్రత్తల వల్ల గత రెండు వారాలుగా పోలీసు సిబ్బంది ఎవరికీ వైరస్‌ సోకలేదు.