https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/voda.jpg?itok=qc6T-M6n

ఆ ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు



న్యూఢిల్లీ: గూగుల్‌ తమ కంపెనీలో వాటాలు కొనుగోలు చేస్తోందన్న వార్తలపై వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేదీ తమ బోర్డు పరిశీలనలో లేదని వివరించింది. ‘కార్పొరేట్‌ వ్యూహం ప్రకారం షేర్‌హోల్డర్లకు మరిన్ని ప్రయోజనాలు కలిగించే అవకాశాలన్నింటినీ సంస్థ నిరంతరం మదింపు చేస్తూనే ఉంటుంది. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ప్రతిపాదనలేవైనా ఉంటే తప్పకుండా నిబంధనల ప్రకారం వెల్లడిస్తాం‘ అని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. వీఐఎల్‌లో గూగుల్‌ దాదాపు 5% వాటా కొనుగోలు చేస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  గూగుల్‌ పెట్టుబడుల వార్తలతో శుక్రవారం వీఐఎల్‌ షేరు ఒకానొక దశలో 35 శాతం మేర ఎగబాకి సుమారు 13 శాతం ఎగిసి రూ. 6.56 వద్ద క్లోజయ్యింది.