http://www.teluguglobal.in/wp-content/uploads/2020/05/kommineni-srinivasa-rao-journalist-prasad-reddy.jpg

సీనియర్ జర్నలిస్ట్‌లకు హైకోర్టు నోటీసులు

తీర్పులపై విమర్శలు, విశ్లేషణలు, వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టు చర్యలు ప్రారంభించింది. తాజాగా మరో 44 మందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వారిలో కొందరిని సీఐడీ అరెస్ట్ కూడా చేసింది.

తాజాగా నోటీసులు జారీ అయిన వారిలో సీనియర్ జర్నలిస్ట్‌లు కొమ్మినేని శ్రీనివాస్‌, ప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ పేరు కూడా ఉంది. అమెరికాలో ఉంటున్న వైద్యుడు పంచ్‌ ప్రభాకర్‌కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.