చై అంటే సంతోషం
సోషల్ మీడియాలో శుక్రవారం సందడి చేశారు సమంత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ లాక్‌డౌన్ సమయంలో సమంత ఏ వంటకం నేర్చుకున్నారు? తనను ఇష్టపడని వారి గురించి ఆమె ఏం చెప్పారు? వీటితో పాటు ఇంకా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమంత ఏం చెప్పారో చదవండి.
► బోర్ కోడుతోంది. ఓ మూవీని సూచించగలరు?
‘జోజో ర్యాబిట్’. ప్రస్తుతానికి నా ఫేవరెట్ మూవీ ఇది.
► ఎప్పటికీ మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి?
‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ (చిన్నప్పటి నుంచి)
► ఈ లాక్‌డౌన్‌లో నేర్చుకున్న వంటకం?
షక్షుక (అల్పాహారానికి చేసుకుంటారు. హెల్దీ బ్రేక్‌ఫాస్ట్).
► టీ లేదా కాఫీ. ఏది ముందు తీసుకుంటారు?
బ్లాక్ కాఫీ.
► మీ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ మీరు నటించిన ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్‌సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు?
నేనూ ఎదురుచూస్తున్నాను.
► నాగచైతన్య (సమంత భర్త) గురించి ఒక్క మాటలో చెప్పండి
సంతోషం.
► నాగచైతన్య కోసం ఏవైనా వంటకాలను వండుతున్నారా?
అవును.
► అమల అక్కినేనిగారి గురించి?
ఫ్రెండ్ అండ్ గైడ్.
► ఒక సెలబ్రిటీగా మీకు కష్టమైన పని?
నా గురించి నిజం కాని విషయాలను నేనే వినడం.
► జిమ్‌లో ఎవరు ఎక్కువ సమయం గడుపుతారు?
కచ్చితంగా చై (నాగచైతన్య)నే. నేను నటిస్తుంటా!
► ఈ సెల్ఫ్ క్వారంటైన్ టైంలో మిమ్మల్ని మీరు ఎలా ఫిట్‌గా ఉంచుకుంటున్నారు?
సాధారణంగా నేను స్పైసీ ఫుడ్ ఇష్టపడతాను. ఆల్రెడీ మూడు బాటిళ్ల పచ్చడి అయిపోయింది. తరచుగా బిర్యానీలు కూడా తింటుంటాను. కానీ నేను అప్పుడప్పుడు ఉపవాసాలు చేయాల్సి వస్తుంటుంది. బహుశా..అలా చేస్తుండటం వల్ల ఫిట్‌గా ఉండటానికి కుదురుతుందేమో.
► మీ ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్ గురించి?
నా బలం...నా బలహీనత.
► మామిడిపండ్లు తింటున్నారా?
రోజుకి రెండు తింటున్నాను.
► మిమ్మల్ని ఇష్టపడనివారి గురించి ఏం చెబుతారు?
వారి ఫిర్యాదులే నాకు స్ఫూర్తిని కలిగిస్తాయి. నా నుంచి మంచి వర్క్‌ని వచ్చేలా చేస్తాయి. వారికి ధన్యవాదాలు.