https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/30/Rohit.jpg?itok=V9Oib-8B

రోహిత్‌ విజయ రహస్యమదే: లక్ష్మణ్‌

న్యూఢిల్లీ: ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణమే ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మను విజయవంతమైన కెప్టెన్‌గా నిలుపుతోందని భారత దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. దక్కన్‌ చార్జర్స్‌ తరఫున తొలిసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రోహిత్‌ విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగిన తీరును లక్ష్మణ్‌ గుర్తు చేసుకున్నాడు. ‘చార్జర్స్‌కు ఆడినప్పుడు రోహిత్‌ యువ ఆటగాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ, ప్రతీ విజయానికి అతని ఆత్మవిశ్వాసం స్థాయి పెరిగిపోయేది. యువకులకు మార్గనిర్దేశం చేస్తూ రోహిత్‌ ప్రధాన ఆటగాళ్ల గ్రూపులోకి చేరిపోయాడు. ఒత్తిడిని అధిగమి స్తూ బ్యాటింగ్‌ చేసిన ప్రతి సారీ అతను ఆటగాడిగా ఎదిగాడు. అందుకే రోహిత్‌ విజయవంతమైన కెప్టెన్‌ అయ్యాడు’ అని లక్ష్మణ్‌ వివరించాడు. కెప్టెన్‌గా రోహిత్‌ ముంబై ఇండియన్స్‌కు 4 టైటిళ్లు అందించాడు.