ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ అయ్యే న్యూస్ ఇది

by
https://www.mirchi9.com/wp-content/uploads/2020/05/Director-Prashanth-Neel-Jr-NTR-1.jpg

కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని, చిత్రపరిశ్రమలను తన వైపు తిప్పుకున్నాడు ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం `కేజీఎఫ్-2` చిత్రీకరణతో ప్రశాంత్ బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా సినిమా పోస్టు-ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు.

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‌తో ప్రశాంత్ సినిమా చేయబోతున్నాడని మొన్న ఆ మధ్య ఇండైరెక్టుగా చెప్పాడు ఆ దర్శకుడు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ ఎన్టీఆర్ కు పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ చెప్పాడట. దానికి ఎన్టీఆర్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడట.

కేజీఎఫ్ లో హీరో యాష్ ని సూపర్ మాస్ గా చూపించాడు ప్రశాంత్. అదే విధమైన సబ్జెక్టు తో గనుక ఎన్టీఆర్ సినిమా చేస్తే… మనం తారక్ లోని మాస్ మూలవిరాట్ ని చూడటం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

గతంలో వారు ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేసారు. అప్పట్లో ఆ సినిమా ఎన్టీఆర్ కేరీర్ లో అతిపెద్ద హిట్. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడు. ఆ తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతోంది. 2021 చివర్లో గానీ, 2022 మొదట్లో గానీ సెట్స్ మీదకు వెళ్తుంది. ఇకపోతే కేజీఎఫ్ 2 ఈ దసరాకు విడుదల కావాల్సింది. అయితే లాక్ డౌన్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది.