తెలంగాణ: 169 పాజిటివ్.. నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2425కు చేరుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 82, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్‌లో 2, సంగారెడ్డిలో ఇద్దరికి కరోనా సోకినట్టు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వీటితోపాటు మరో ఐదుగురు వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. కరోనా బారినపడివారిలో ఇవాళ నలుగురు మృతి చెందారని తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 71కి చేరింది. తాజాగా 36 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1381 కి చేరిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 973 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు.
(చదవండి: రైల్వే టిక్కెట్లు; తాజా అప్‌డేట్స్)