https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/C-V-Anand.jpg?itok=vfU4jziO

ఎన్టీపీసీ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్టీపీసీ రీజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (దక్షిణ)గా సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌లో శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఎన్టీపీసీ పశ్చిమ ప్రాంత రీజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ముంబైలో పనిచేశారు. అదే సమయంలో దక్షిణ ప్రాంత ఆర్‌ఈడీగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన సీవీ ఆనంద్‌ 1983లో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ట్రైనీగా చేరారు. సుదీర్ఘ కెరీర్‌లో ఆయన ఎన్టీపీసీ పవర్‌ ప్లాంట్ల నిర్వహణ, ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు.

చదవండి : సర్వే ఆధారంగానే లాక్‌డౌన్‌పై నిర్ణయం