http://www.teluguglobal.in/wp-content/uploads/2020/05/nimmagadda-ramesh-kumar-ap-state-election-commissioner.jpg

నేను మళ్లీ విధుల్లో చేరుతున్నా – నిమ్మగడ్డ

ఎన్నికల కమిషనర్‌ నియామకం నిబంధనలను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ స్వాగతించారు. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినందున తక్షణం తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్టు చెప్పారు.

వ్యక్తులు ముఖ్యం కాదు… వ్యవస్థలు, రాజ్యాంగ విలువలు ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సంస్థ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. గతంలోలాగే నిష్ఫక్షపాతంగా విధులు నిర్వహిస్తానని చెప్పారు. అందరితో చర్చించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటానని వివరించారు.

కనగరాజు నియామకాన్ని హైకోర్టు కొట్టివేసినందున పాత కమిషనర్ కొనసాగుతారని న్యాయవాది జంద్యాల రవిశంకర్ చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి చార్జ్ తీసుకోవాల్సిన అవసరం లేదని… ఆయన గతం నుంచి ఈసీగా కొనసాగుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు.