ఆ పదం తొలగించే అవకాశం ఉంటుందా?
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ట్వీట్‌తో రెగ్యలర్‌గా టచ్‌లోనే ఉంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమలు చేస్తున్న వర్క్ ఫ్రం హోం ఉంటే లాభ, నష్టాల గురించి ఇంతకుముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజాగా మరోసారి వర్క ఫ్రం హోం గురించి మాట్లాడుతూ మరోసారి ట్వీట్ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేస్తున్నప్పటి నుంచి వెబినార్ సమావేశాలు(వీడియా కాన్ఫరెన్స్ మీటింగ్) ఎక్కువైపోయాయి.
(భయానకం : జమ్మూ హైవేపై సిలిండర్ల పేలుడు)
వెబినార్ అనే పదం ఇప్పుడు తనకు కోపం తెప్పించే పదంగా మారిందంటూ ఆనంద్ అసహనం వ్యక్తం చేశారు. ' వెబినార్ నుంచి నాకు మరో ఆహ్వనం అందితే మాత్రం కచ్చితంగా నేను సీరియస్ అవుదామనుకుంటున్నా. ఒక వేళ నాకు అవకాశం వస్తే ఈ మధ్యనే డిక్షనరీలోకి కొత్తగా వచ్చి చేరిన వెబినార్ అనే పదాన్ని బ్యాన్ చేయడానికి పిటిషన్ వేసే అవకావం ఉంటుందా? ' అంటూ తన పాలోవర్స్‌ను ఉద్దేశించి అడిగారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.