https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/Adimulapu-Suresh.jpg?itok=1L2VKuF3

‘హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన రాజకీయాలు చేస్తున్నారు’

సాక్షి, వైఎస్సార్‌ కడప: ఏడాది పాలనలో ముఖ్యమంత్రి దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ... ‘సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు చూసి ఓర్వలేక పోతున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సంస్కరణలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కులాలకు,మతాలకు, పార్టీలకు అతీతంగా పని చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  ఏదో విధంగా ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పరిపాలనలో పారదర్శకత, ఆలోచన విధానంలో కీలక నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానాన్ని హైకోర్టు ఆలోచించలేదు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం అని’ సురేష్‌ తెలిపారు. ('బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా')