https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/jim-ping.jpg?itok=Dim2C__6

స్వేచ్ఛకు సంకెళ్లు: మరో వివాదంలో చైనా

బీజింగ్‌ : ప్రపంచ ప్రజానీకంపై పెను విషాదాన్ని నింపుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు పురుడుపోసిన చైనా.. ప్రపంచం ముందు మరో పెను వివాదాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచ దేశాల పెట్టుబడులకు స్వర్గధామంగా పేరొందిన హాంకాంగ్‌ స్వేచ్ఛకు డ్రాగన్‌ దేశం సంకెళ్లు వేసింది. తన సామ్రాజాన్ని మరింత విస్తరించుకునేందుకు మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాంకాంగ్‌పై మరింత పట్టు సాధించేందుకు వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని గురువారం చైనా పార్లమెంట్‌ ఆమోదించింది. ఆ చట్టంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు స్వతంత్ర దేశంగా ఉన్న హాంకాంగ్‌ తాజా చట్టంతో పూర్తిగా చైనా ఆధిపత్యంలోకి వెళ్తుందని దీంతో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
(చైనా పార్లమెంట్‌ కీలక నిర్ణయం)

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/29/hong-kong.jpg

చైనా చేసిన దుశ్చర్యపై తాము లోతుగా ఆలోచిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇదివరకే ప్రకటించగా.. జపాన్‌ సైతం చైనా చట్టాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.  మరోవైపు హాంకాంగ్‌ భవిష్యత్‌పై యూరోపియన్‌ యునియన్‌కు చెందిన 27 దేశాల ప్రతినిధులు శుక్రవారం చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చైనా వివాదాస్పద చట్టంపై బ్రిటన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంకాంగ్‌ స్వేచ్చకు తూట్లు పొడిచే విధంగా చైనా చట్టం రూపొందించిందని విమర్శించింది. ఈ చట్టాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, హాంకాంగ్‌కు అండగా ఉంటామని బ్రిటన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాలపైకి చైనా కుట్రపూరితంగా లీక్‌ చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలోనే మరో వివాదంలో డ్రాగన్‌ దేశం విమర్శలపాలవుతోంది. (ట్రంప్‌ మధ్యవర్తిత్వం: కొట్టిపారేసిన చైనా)

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/05/29/briatn_0.jpg

బ్రిటన్‌ 99 ఏళ్ల లీజు..
కాగా అప్పట్లో జరిగిన నల్లమందు యుద్ధాల ఒప్పందంలో భాగంగా హాంకాంగ్‌ను బ్రిటన్‌ 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందానికి గడువు 1996లోనే ముగియడంతో తిరిగి చైనాకు అ‍ప్పగించింది. దీంతో హాంకాంగ్‌ను ప్రత్యేక దేశంగానే గుర్తిస్తామని డ్రాగన్‌ ప్రకటించినప్పటికీ.. పెత్తనం మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే హాకాంగ్‌పై పూర్తి పట్టుసాధించాలని జాతీయ భద్రతా చట్టం పేరుతో దుశ్చర్యకు పాల్పడింది. ఈ చట్టం ప్రకారం కమ్యూనిస్ట్‌ చైనాలోని పలు చట్టాలు నేరుగా అక్కడ అమలవుతాయి. చైనా కరెన్సీ అమల్లోకి వస్తుంది. వాణిజ్య నిర్ణయాల్లో చైనా జోక్యం పూర్తిగా ఉంటుంది. ఈ కారణంగా పలు ప్రపంచ దేశాలు చైనా తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి. (హాంకాంగ్‌పై మరింత పట్టు)