తమిళనాడులో 20,000 దాటిన కరోనా కేసులు
- కరోనా హాట్‌స్పాట్‌గా చెన్నై
చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 874 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,000 మార్క్ దాటి 20,246కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేవలం చెన్నై నగరం నుంచే 618 కేసులు వెలుగుచూశాయి. ఇక గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 9 మంది మరణించారు. ఇక కోవిడ్-19 నుంచి కోలుకుని 11,313 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు.