మళ్లీ కొండెక్కిన బంగారం
- గోల్డ్‌రేస్
ముంబై : ఇటీవల దిగివస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. హాంకాంగ్ అంశంలో అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసుల పెరుగుదలతో మదుపుదారులు తిరిగి బంగారంలో పెట్టుబడులకు మళ్లడంతో గోల్డ్ ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ స్వర్ణం ప్రియమైంది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల పసిడి రూ 209 పెరిగి రూ 46,614కు చేరింది. ఇక కిలో వెండి రూ 167 భారమై రూ 48,725కు పెరిగింది. ఇక అంతర్జాతీయ అనిశ్చితి, రాజకీయ..భౌగోళిక అంశాల నేపథ్యంలో పసిడి ధర మున్ముందుకు కదిలే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.