డిప్యూటీ కలెక్టర్‌గా సుబ్రహ్మణ్యం కుమార్తె
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్తె పి.సింధును ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల నిబంధనలను అనుసరించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింధు కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు.
(చదవండి: అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్‌మాధవ్)