ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ… నిమ్మగడ్డను ఈసీగా నియమించాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగింది. ఎస్‌ఈసీ పదవీకాలం తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్టినెన్స్‌ను కొట్టివేసింది. కొత్త ఎన్నికల కమిషనర్ నియమానికి సంబంధించి జారీ చేసిన జీవోలను కూడా కొట్టి వేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గిస్తూ ఆర్టినెన్స్ తెచ్చే అధికారం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆర్టినెన్స్ తెచ్చింది. ఈ ఆర్టినెన్స్ కారణంగా నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిపోయిందని వెల్లడించింది. కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమించింది. తాజాగా కనగరాజ్ నియామకం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.