http://www.teluguglobal.in/wp-content/uploads/2020/05/sanjjanaa-galrani.jpg

పెళ్లిపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

పెళ్లి గురించి హీరోయిన్లను అడిగితే రొటీన్ సమాధానాలు వస్తాయి. పెళ్లికింకా చాలా టైమ్ ఉందని, ప్రస్తుతానికి పెళ్లికి మూడ్ లేదని, తగిన వ్యక్తి దొరకలేదని, పనితోనే తనకు పెళ్లయిందని ఇలా రకరకాలుగా కోతలు కోస్తుంటారు హీరోయిన్లు. ఇలాంటి టైమ్ లో ఇద్దరు హీరోయిన్లు తమ పెళ్లిళ్లపై కాస్త వెరైటీగా స్పందించారు.

మొన్నటికి మొన్న హీరోయిన్ తేజశ్వి పెళ్లిపై డిఫరెంట్ గా రియాక్ట్ అయింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు కరోనాకు వ్యాక్సిన్ రాగానే పెళ్లి చేసుకుంటానంటూ సెటైరిక్ గా సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ. దాదాపు ఇదే టైపులో తన పెళ్లిపై కూడా రియాక్ట్ అయింది సంజన. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ బ్యూటీ.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఏ క్షణానైనా పెళ్లి చేసుకుంటానంటోంది.

ప్రతి ఒక్కరు ఏదో ఒక టైమ్ లో పెళ్లి చేసుకోవాల్సిందే కాబట్టి తను కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది సంజన. అంతేకాదు.. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అయితే అతడ్నే పెళ్లి చేసుకుంటానా లేక వేరే వ్యక్తిని పెళ్లాడతానా అనే విషయాన్ని కూడా చెప్పలేనంటోంది. ఇలా పెళ్లి గురించి అడిగితే తిక్కతిక్కగా సమాధానం చెప్పి తప్పించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లు, సీరియల్స్ తో యమ బిజీగా ఉంది.