https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/high-court.jpg?itok=gp3Id9oj

రమా మెల్కోటే వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మేడ్చల్‌ రహదారిపై ఇబ్బందులు పడుతున్నారన్న వ్యాజ్యంపై  హైకోర్టు విచారణ చేపట్టింది. సామాజిక కార్యకర్త రమా మెల్కోటే ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇటీవల వేసిన పిటిషన్‌ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుక్రవారం విచారణ జరిపింది. మేడ్చల్‌లో ప్రస్తుతం వలస కూలీలు లేరని, వారి స్వస్థలాలకు తరలించామని ప్రభుత్వ తెలిపిన విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికీ వందలో సంఖ్యలో వలసకూలీలు ఉన్నారని న్యాయవాది వసుధ నాగరాజు పేర్కొన్నారు. దీంతో మేడ్చల్‌ వెళ్లి పరిశీలించేందుకు అడ్వకేట్‌ కమిషన్‌గా పవన్‌కుమార్‌ను కోర్టు నియమించింది. ఆయనతో పాటు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కూడా వెళ్లాలని ఆదేశించి.. తదుపరి విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.