‘ఈ జిల్లాల్లోనే పిడుగులు పడే అవకాశం ఉధృతం’
సాక్షి, విజయవాడ: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని శుక్రవారం రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చిరించారు. ఉపరితల ద్రోణి కారణంగా నేటి నంచి కురిసే వర్షాలకు శ్రీకాకుళం: సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం విజయనగరం జిల్లా: కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరాలు. విశాఖ జిల్లా: హుకుంపేట,అనంతగిరి, అరకులోయ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని చెప్పారు. కావునా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపురులు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కమీషనర్ సూచించారు.