https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/corona-cases.jpg?itok=zNqfZ4Y_

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11638 కరోనా సాంపిల్స్‌ పరీక్షించగా.. 33 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం ఒక్కరోజే 79 మంది కరోనా బాధితులు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి కొత్తగా ఒక్కరు మృతి చెందారు. కాగా రాష్ట్రంలో మొత్తం నమోదైన 2874 పాజిటివ్‌ కేసులకు 2037  మంది పూర్తిగా కోలుకోగా... 60 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 777 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.మరోవైపు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, 175 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. (భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు)