https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/maxresdefault.jpg?itok=OvSxpB1F

3నెలల్లో 20శాతం వరకు రాబడినిచ్చే 3 షేర్లు ఇవే..!



మార్కెట్‌ ర్యాలీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని  రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు వికాస్‌ జైన్‌ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీలో మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ షేర్ల ప్రదర్శన తక్కువగా ఉందని, రాబోయే కొద్ది వారాల్లో ఈ షేర్లలో అద్భుతమైన ర్యాలీని చూడవచ్చని జైన్‌ అంటున్నారు. 

నిఫ్టీ ఇండెక్స్‌ అప్‌సైడ్‌లో 9,750 వద్ద నిరోధ స్థాయిని కలిగి ఉందని, దాన్ని అధిగమిస్తే 9,800 వద్ద మరో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని జైన్‌ అంచనా వేస్తున్నారు. ఇక్‌ డౌన్‌సైడ్‌లో 9,250వద్ద కీలక మద్దతు స్థాయిని కలిగి ఉందని, ఈ స్థాయిని కోల్పోతే 9,050వద్ద మరో కీలక మద్దతు ఉందన్నారు. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ప్రదర్శన రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని జైన్‌ చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా జైన్‌ 3నెలల వ్యవధిలో 20శాతం వరకు రాబడులనిచ్చే 3స్టాకులను సిఫార్సు చేశారు. 

షేరు పేరు: సెంచురీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.340
స్టాప్‌ లాస్‌: రూ.253
అప్ ‌సైడ్‌: 20శాతం
విశ్లేషణ: ఈ షేరు నెలవారీ ఎక్స్‌పైరీ ఛార్ట్‌లో హమ్మర్‌ క్యాండిల్‌ ప్యాట్రన్‌ రూపొందించింది. హయ్యర్‌ సైడ్‌లో బలమైన రివర్సల్‌ బ్రేక్‌అవుట్‌ను ఆశించవచ్చు. బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు 4వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్‌ఎస్‌ఐ గత కొన్నివారాల నుంచి యావరేజ్‌ లైన్‌పై ట్రేడ్‌ అవుతోంది. కాబట్టి ట్రేడర్లు రూ.253ని స్టాప్‌ లాస్‌గా నిర్దేశించుకొని రూ.340 టార్గెట్‌ ధరగా కొనుగోలు చేయవచ్చు. 

షేరు పేరు: కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.410
స్టాప్‌ లాస్‌: రూ.324
అప్‌సైడ్‌: 17శాతం 
విశ్లేషణ: ఈ షేరు దాని స్వల్ప మరియు మధ్యకాలిక యావరేజ్‌ల దగ్గర  ట్రెండ్ అవుతోంది.  ప్రస్తుత స్థాయిల నుండి పైకి బ్రేక్అవుట్ కావొచ్చు. వీక్లీ ఛార్ట్‌లో హయ్యర్‌ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో పాజిటివ్‌ అవుట్‌లుక్‌ను ఆశించవచ్చు .

షేరు పేరు: టెక్‌ మహీంద్రా 
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.595
స్టాప్‌ లాస్‌: రూ.491
అప్‌ సైడ్‌: 12శాతం
విశ్లేషణ: ఈ షేరుకు త్రైమాసికపు సగటు రూ.485 వద్ద కీలక మద్దుత స్థాయిని కలిగి ఉంది. ఇది తక్కువ శ్రేణి నుండి సానుకూల మూమెంటంను అందుకుంది. కీలకమైన ఆర్‌ఎస్ఐ ఇండికేటర్‌ దాని యావరేజ్‌ లైన్‌కు పైన ట్రేడ్‌ అవుతోంది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి బ్రేక్‌ అవుట్‌ అయ్యి తదుపరి ర్యాలీకి సిద్ధమవడాన్ని సూచిస్తుంది.