
సీఐఎస్‌ఎఫ్‌లో కరోనా కలకలం
- మహమ్మారితో ముగ్గురు జవాన్లు బలి
కోల్‌కతా : కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్‌ఎఫ్) చెందిన ఓ జవాన్ శుక్రవారం మరణించారు. మరణించిన జవాన్‌ను కోల్‌కతాకు చెందిన జీఆర్‌ఎస్‌ఈఎల్ యూనిట్‌కు చెందిన సుశాంత్ కుమార్ ఘోష్‌గా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. కోవిడ్-19తో కోల్‌కతాలో ఇప్పటివరకూ ముగ్గురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మరణించారు.
ఇక ఈ నెల ఆరంభంలో నగరంలోని సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ ఎస్‌ఐ (55) కోవిడ్-19 సోకి మరణించారు. అంతకుముందు కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం వద్ద విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్ ఏఎస్‌ఐ ఒకరు కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు.