https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/monkey.jpg?itok=9RzpguQC

క‌ల‌కలం: క‌రోనా సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి

ల‌క్నో‌: మీర‌ట్ వాసులు కోవిడ్ భ‌యంతో వ‌ణికిపోతున్నారు. దీనికి కార‌ణం అక్క‌డి కోతుల గుంపు చేసిన తుంట‌రి ప‌నే. ఆట బొమ్మ అనుకుందో, అర‌టి పండే అనుకుందో ఏమో కానీ ఓ కోతుల గుంపు క‌రోనా అనుమానితుల న‌మూనాల‌ను ఎత్తుకెళ్లింది. ఈ వింత‌ ఘ‌ట‌న ఉత్త‌రప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. మీర‌ట్‌ మెడికల్‌ కాలేజీలో ముగ్గురు కోవిడ్ అనుమానితుల‌కు వైద్యులు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీటిని ప‌రీక్షించేందుకు శుక్ర‌వారం ఓ ల్యాబ్ టెక్నీషియ‌న్ ఈ టెస్ట్ సాంపిల్స్‌ను మోసుకు వెళుతుండ‌గా ఒక్కసారిగా కోతులు అత‌నిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. (కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం)

అనంత‌రం అత‌ని ద‌గ్గ‌ర ఉన్న సాంపిల్స్‌ను ఎత్తుకెళ్లాయి. అందులో ఓ కోతి క‌రోనా టెస్టింగ్ కిట్‌ను న‌మిలివేస్తూ క‌నిపించింద‌ని గ్రామ‌స్థులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంత‌వాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. టెస్టింగ్ కిట్ల‌లో క‌రోనా వైర‌స్‌ ఉండొచ్చేమోన‌ని, వాటిని వాన‌రాలు ఎక్క‌డ‌ త‌మ ఇళ్ల‌పై విసిరేస్తాయోన‌ని ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నారు. మ‌రోవైపు వైద్యులు కోవిడ్ అనుమానితుల ద‌గ్గ‌ర నుంచి మ‌రోసారి నమూనాల‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపారు. (పెళ్లి మండ‌పం నుంచే క్వారంటైన్ సెంట‌ర్‌కు..)