http://www.teluguglobal.in/wp-content/uploads/2020/05/Venkateshwara-Pranav-Lalith-Gopal-Devati-Malavika-Devati-arrest.jpg

పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐకి వల… తల్లీకొడుకు అరెస్ట్‌

హైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్‌ మాటున ఎన్‌ఆర్‌ఐని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలు మాళవికను జూబ్లిహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను డాక్టర్‌నంటూ ఫేక్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి ..మాళవిక, ఆమె కుమారుడు ఓ ఎన్నారై నుంచి 65 లక్షలు కొట్టేశారు. తనకు పెళ్లి కాలేదని.. కోట్ల ఆస్తి వుందని.. ఆ ఎన్‌ఆర్‌ఐని ఈమె నమ్మించింది. తనకు తల్లితో ఆస్తివివాదాలు ఉన్నాయని…ఈ సమస్యలు పరిష్కరించుకుంటే కోట్ల ఆస్తి వస్తుందని ఆ ఎన్‌ఐఆర్‌ఐని నమ్మించింది.

కోర్టులో కేసు గెలిచేందుకు డబ్బు కావాలంటూ మాళవిక ఆమె కుమారుడు ప్రణవ్‌.. ఎన్నారై నుంచి 65 లక్షలు తీసుకున్నారు. కోర్టులో కేసు హియరింగ్‌ వస్తుందని దఫదఫాలుగా ఈ సొమ్ము దండుకున్నారు. తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని… అప్పుడు భర్తగా ఆస్తిపై హక్కులుంటాయని అతనికి మస్కా కొట్టారు. అతనొక్కడినే కాదు… ఇలా ఎంతో మందిని ట్రాప్‌ చేశారు తల్లీ కొడుకు.

గతంలో మాళవిక, ఆమె భర్త శ్రీనివాస్‌పై చీటింగ్‌ కేసులున్నాయి. మూడుసార్లు అరెస్టయినా సరే మళ్లీ మళ్లీ అవే నేరాలకు పాల్పడ్డారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు మాళవిక అండ్‌ ఫ్యామిలీ.

మొత్తానికి ఇప్పుడు నాల్గోసారి అరెస్టు అయ్యారు. ఇలాంటి మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.