బుట్టబొమ్మ సారీ చెప్తుందా?
టాలీవుడ్ ప్రముఖ కథానాయుకలు సమంత అక్కినేని, పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వివాదం మరింత ముదిరింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని గురువారం పూజా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు తన టెక్నికల్ టీం సాయంతో ఖాతాను తిరిగి పునరుద్దరించినట్లు తెలిపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఖాతా హ్యాక్ అయిన సందర్భంలో పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో.. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను జత చేస్తూ ఈమె (సమంత )నాకు పెద్దగా అందంగా కనిపించదు అంటూ కామెంట్ చేశారు హ్యాకర్స్ . ఇది సమంత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. (సమంతకు సారీ చెప్పాలి )
అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం పట్టించుకోలేదు. వెంటనే సమంతకు సారీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. దీనికి తోడు డైరెక్టర్ నందినీ రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద..పూజా హెగ్డేను ఉద్దేశించి వ్యంగాస్ర్తాలు సందించారు. నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది అంటూ నందనీ కామెంట్ పెడితే, ప్లీజ్ లవ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు అంటూ చిన్మయి వరుస కామెంట్లు పెడుతూ సమంతకు అండగా నిలిచారు.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వైరల్ చేస్తూ.. ఫెమినిస్ట్ అని చెప్పుకునే తిరిగే చిన్మయి ఇంకో అమ్మాయిపై ఎలా నిందలు వేయగలుగుతుంది అంటూ పూజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిజాలు తెలుసుకోకుండా ఇలా చీప్ కామెంట్లు పెడతారా అంటూ నందనీరెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరి అటు సమంత ఫ్యాన్స్, ఇటు బుట్టబొమ్మ ఫ్యాన్స్ వరుస ఆరోపణలు చేస్తూ ట్విట్టర్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. 'వి సపోర్ట్ పూజా హెగ్డే' అంటూ ఆమె అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు.