బ్రిగేడ్, ఒబేరాయ్ రియల్టీల జోరు
మే నెలలో చివరి ట్రేడింగ్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ షేర్లు మాత్రం జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఉదయం 11:30 ప్రాంతంలో నిఫ్టీ రియల్టీ 2.2 శాతం లాభపడి రూ.176.60 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్‌లో రూ.171.25 వద్ద ప్రారంభమైన నిఫ్టీ రియల్టీ ఒక దశలో రూ.177 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన బ్రిగేడ్ దాదాపు 4 శాతం పెరిగి రూ.105 వద్ద, ఒబేరాయ్ రియల్టీ 3 శాతం పెరిగి రూ.316.6వద్ద, గోద్రేజ్ ప్రాపర్టీస్ 3 శాతం పెరిగి రూ.673 వద్ద,ప్రెస్టేజ్ 3 శాతం పెరిగి రూ.149.40 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డీఎల్‌ఎఫ్ 2 శాతం పెరిగి రూ.147 వద్ద, ఫోనిక్స్ లిమిటెడ్ 2 శాతం లాభపడి రూ.501 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లోని మరికొన్ని కంపెనీలు శోభా,మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ స్వల్పలాల్లో ట్రేడ్ అవుతుండగా.. సన్‌టెక్, ఐబీ రియల్‌ఎస్టేట్‌లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.