https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/saad.jpg?itok=XGnodPa6

తబ్లీగ్ జమాత్ చీఫ్‌‌పై సీబీఐ దర్యాప్తు

న్యూఢిల్లీ: తబ్లీగ్ జమాత్ చీఫ్‌, నిజాముద్దీన్ మర్కజ్‌కు చెందిన మౌలానా సాద్‌కు హవాలా మార్గంలో విదేశాల నుంచి వచ్చిన విరాళాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొనసాగిస్తోంది. నిజాముద్దీన్‌లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన మౌలానా సాద్ పై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం హవాలా మార్గంలో మౌలానాకు విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసింది. దీంతో తాజాగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు, ఈడీ, ఐటీ విభాగాల నుంచి మౌలానాకు అందిన విదేశీ విరాళాలపై సమాచారాన్ని సేకరించారు. తబ్లీగ్ జమాత్ విదేశీ విరాళాల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న మౌలానా సన్నిహితుడైన ముర్సలీన్‌ను మే 16న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారించారు. చదవండి: 82 మంది విదేశీయులపై చార్జీషీటు దాఖలు

జమాత్ ట్రస్టుకు విదేశీ విరాళాలు హవాలా మార్గంలో స్వీకరించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలడంతో సీబీఐ రంగంలోకి దిగి మౌలానా సాద్ పై దర్యాప్తు సాగిస్తోంది. మర్కజ్ ట్రస్ట్‌తోపాటు మౌలానా సాద్‌పై సీబీఐ చర్యలు తీసుకోనుంది. అంతకుముందు మర్కజ్ విరాళాలపై కీలక పత్రాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మార్చి 13 తరువాత మార్కాజ్ లోపల ఉన్న వేలాది మంది భారతీయులను, విదేశీయులను దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ధిక్కరించడానికి మౌలానా సాద్ ప్రోత్సహించారని ఆరోపణలున్నాయి. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన 4,300 మంది వ్యక్తులు మర్కజ్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు సూచిస్తున్నాయి.

చదవండి: ఎన్ ‌95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం