కరోనాను జయించిన బామ్మ : బీర్‌తో సెలబ్రేషన్
వాషింగ్టన్ : చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ కరోనా కబళిస్తుంటే 103 ఏళ్ల బామ్మ మాత్రం మృత్యువు అంచుల దాకా వెళ్లి పూర్తిగా కోలుకుంది. కోలుకున్న శుభ సందర్భంగా ఆసుపత్రిలోనే చిల్డ్ బీర్స్‌తో సెలబ్రేట్ కూడా చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా మే నెలలో కరోనా బారిన పడింది. అందులోనూ వృద్ధురాలు కావడంతో అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో స్టెజ్నాపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. దీంతో ఆమె చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా స్టెజ్నా కరోనా నుంచి కోలుకుంది. చావు వరకూ వెళ్లిన బామ్మ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. కోలుకున్న బామ్మ కూడా చిల్డ్ బీర్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె మనువరాలు షెల్లీ గన్ సోషల మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో పలు పత్రికలు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రచురించాయి. (ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్ )
ఈ సందర్భంగా షెల్లీ మట్లాడుతూ, ‘మా బామ్మ తన జీవిత కాలంలో మా కోసం చాలా కష్టపడింది. ఈ వయసులో ఆమె కరోనాకు గురి కావడంతో మేం చాలా ఆందోళనకు గురయ్యాం. అంతేకాకుండా ఆమె పరిస్థితి కూడా విషమించడంతో ఆశలు వదులుకున్నాం. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నాం. కానీ బామ్మ కోవిడ్‌ను జయించింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఈ విషయాన్ని మేమే నమ్మలేకపోతున్నాం. అంటూ ఆనందం వ్యక్తం చేసింది'’ అంతేకాకుండా 103 ఏళ్ల వయసులోనూ కరోనా వైరస్‌ను తట్టుకుని కోలుకోవడంతో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్పత్రి సిబ్బందే ఆమెకు చిల్డ్ బీర్ అందించారు. అది చూడగానే బామ్మ మరింత సంతోషంతో బీర్‌ను ఎంజాయ్ చేసింది అంటూ షెల్లీ పేర్కొంది. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం )