https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/mm.jpg?itok=kEu8sXqb

ఏడాదిగా బాలికపై లైంగికదాడి

సాక్షి, రామగిరి(నల్గొండ) :  ఏడాదిగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న నలుగురు యువకులను తిప్పర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగదుర్గాప్రసాద్‌ కేసు వివరాలు వెల్లడించారు. తిప్పర్తి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బొబ్బలి నవీన్‌ ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇది గమనించిన నవీన్‌ స్నేహితుడు గజ్జి రమేష్‌ ఆ బాలికపై కన్నేశాడు. ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధాన్ని అందరికీ చెబుతానంటూ ఆ బాలికను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతున్న బాతుక శంకర్, సింగం అనిల్‌ కూడా ఆ బాలికను బెదిరించి లోబర్చుకున్నారు. ఇలా ఆ బాలికపై ఏడాది కాలంగా నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడుతూనే ఉన్నారు. 
(ఎన్ ‌95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం )

ఆరోగ్యం బాగా లేకపోవడంతో..
కొంతకాలంగా బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గర్భం దాల్చిందని చెప్పారు. దీంతో ఇందుకు కారకులెవరని నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రికి వివరించి బోరుమంది. వెంటనే బాలిక తల్లి గత 21వ తేదీన తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం సోమోరిగూడెంలోని ఎల్లెంల నాగిరెడ్డి రేకుల షెడ్డు వద్ద నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం రావడంతో వారిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. వీరిపై ఐపీసీ 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ జి.సత్యనారాయణ, రైటర్‌ రమేష్, మీరా సాహెబ్, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.(వీడియోలతో బ్లాక్‌ మెయిలింగ్‌..)