https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/corona-twin.jpg?itok=myM4v5d5
ఆరోగ్యంతో ఉన్న కవలలు

ఆ కవలలకు కరోనా లేదు

గాంధీఆస్పత్రి :  సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో బుధవారం జన్మించిన కవలలకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని, తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. వివరాల్లోకి వెళితే... మేడ్చల్‌ జిల్లాకు చెందిన గర్భిణి (20) ప్రసవం కోసం నిలోఫర్‌ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఈనెల 25న గాంధీ ఆస్పత్రికి తరలించారు.  గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యులు రేణుక, అపూర్వ, దీప్తి, పీజీలు రహస్య, చందన తగిన జాగ్రత్తలు తీసుకుని ఈనెల 26న ఆమెకు సిజేరియన్‌ చేయగా ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. అనంతరం చిన్నారులకు  నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా గురువారం అందిన నివేదికలో కరోనా నెగిటివ్‌ వచ్చింది. తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, బాలింతను త్వరలోనే డిశ్చార్జి  చేస్తామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (కరోనా బాధితురాలికి కవల పిల్లలు)