ఈజీ జర్నీ..
- కామినేని రెండో ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్‌పాస్ ప్రారంభం
- ప్యాకేజీ–2లో మొత్తం 14పనులు
- అంచనా వ్యయం : రూ. 448 కోట్లు
- ఇప్పటికే ఐదు పూర్తి
- అన్నీ పూర్తయితే సిగ్నల్ ఫ్రీ
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లోని ఈస్ట్‌జోన్‌లో సాగర్‌రింగ్ రోడ్, ఎల్‌బీనగర్ జంక్షన్, కామినేని జంక్షన్, ఉప్పల్ జంక్షన్‌లు అత్యంత రద్దీ ప్రాంతాలు. విజయవాడ, నాగార్జునసాగర్, శంషాబాద్ విమానాశ్రయం వైపుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రావాలన్నా..తిరిగి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం నరకప్రాయం. ఈ సమస్యల పరిష్కారానికి ఎస్సార్‌డీపీ ఫేజ్ వన్ ప్యాకేజీ–2లో భాగంగా వివిధ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, లూప్‌ల వంటి వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 14 పనుల్లో గురువారం ప్రారంభమైన రెండింటితో సహా ఇప్పటికి ఐదు పనులు పూర్తయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు కొంత మేరఉపశమనం లభించింది. మిగతావన్నీ పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, దిల్‌సుక్‌నగర్‌ల నుంచి నుంచి నల్లగొండ, విజయవాడల వైపు, అలాగే నాగార్జునసాగర్, శంషాబాద్ వైపు వెళ్లేవారికి.. ఆప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి సిగ్నల్ జంజాటాల్లేని ప్రయాణం సాధ్యం కానుంది.
పూర్తయి వినియోగంలోకి వచ్చినవి
♦ ఎల్‌బీనగర్ ఎడమవైపు ఫ్లై ఓవర్, కామినేని వద్ద రెండు ఫ్లై ఓవర్లు, ఎల్‌బీనగర్ వద్ద ఎడమవైపు అండర్‌పాస్, చింతల్‌కుంట వద్ద అండర్‌పాస్
పూర్తి కావాల్సినవి..
♦ ఎల్‌బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్
♦ ఎల్‌బీనగర్ వద్ద కుడివైపు అండర్‌పాస్
♦ బైరామల్ గూడ వద్ద ఫస్ట్ లెవెల్‌లో కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు
♦ బైరామల్ గూడ వద్ద సెకెండ్ లెవెల్‌లో ఫ్లై ఓవర్
♦ బైరామల్ గూడ వద్ద కుడి, ఎడమవైపుల లూప్‌లు
♦ కామినేని అండర్‌పాస్ నాగోల్ జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్
ట్రాఫిక్ రద్దీ ఇలా..
ఈస్ట్‌జోన్‌లోని ఆయా జంక్షన్ల వద్ద భవిష్యత్‌లో ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ నిపుణులు అంచనా వేశారు. ఆమేరకు.. 2034 నాటికి రద్దీ సమయాల్లో గంటకు ఉండే ట్రాఫిక్ పీసీయూ.. పూర్తయిన, పూర్తి కావాల్సిన పనుల అన్నింటి అంచనా వ్యయం :రూ. 448 కోట్లు