https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/Flight.jpg?itok=GM_vXKtT

క‌రోనా : ఇండిగో విమాన ప్ర‌యాణికుల్లో అత్య‌ధికంగా..

న్యూఢిల్లీ : దాదాపు రెండు నెల‌ల విరామం అనంత‌రం దేశీయ విమానయాన సేవ‌లు తిరిగి ప్రారంభ‌మైన నాలుగు రోజుల్లోనే వివిధ విమానాల్లో ప్ర‌యాణించిన 23 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేల‌డం క‌ల‌కలం రేపుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని విమాన‌యాన స‌ర్వీసులు మూసివేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు నెల‌ల అనంత‌రం మే 25 నే దేశీయ విమాన‌యాన సేవ‌ల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ప‌లువురు వారి గమ్య‌స్థానాల‌కు చేర‌డానికి విమానాల్లో ప్ర‌యాణించారు. విమాన‌యాన సేవ‌లు తిరిగి ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 23 మందికి పైగా వైర‌స్ భారిన ప‌డ‌టంతో త‌దుప‌రి చ‌ర్య‌లు ఏం తీసుకుంటారో అన్న దానిపై చ‌ర్చ మొద‌లైంది. (క్వారంటైన్‌లో 23 లక్షల మంది )

 కోవిడ్  సోకిన ప్ర‌యాణికుల‌ను క్వారంటైన్‌లో ఉంచారు. అంతేకాకుండా వారితో ప్ర‌యాణించిన మిగ‌తా ప్ర‌యాణికులు , సిబ్బందిని కూడా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఐసోలేష‌న్‌లో ఉంచారు. లాక్‌డౌన్ 4.0లో భారీ స‌డ‌లింపుల‌కు కేంద్రం ప‌చ్చ‌జెండా ఊపింది. దీనిలో భాగంగానే దీశీయ విమాన కార్య‌క‌లాపాలు సాగించ‌డానికి అనుమ‌తిచ్చింది. భౌతిక‌దూరం పాటించ‌డం, ఫేస్ మాస్క్‌, శానిటైజేష‌న్, ప్ర‌యాణికులు రెండు గంట‌ల ముందే ఏయిర్‌పోర్టుకు చేరుకోవాలి అన్న నిబంధ‌న‌లు విధిస్తూ దేశీయ విమామ‌యానానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయినప్ప‌టికీ మే 25 నుంచి 28 వ‌ర‌కు కేవ‌లం నాలుగు రోజుల్లోనే 23 మంది వైర‌స్ భారిన  ప‌డ్డారు. ఇంకో ఆందోళ‌నక‌ర విష‌యం ఏంటంటే..ఈ 23 మంది ప్ర‌యాణికుల్లో ఎక్కువ‌మంది ఇండిగో విమానంలోనే ప్ర‌యాణించారు. భార‌త‌దేశ‌పు అతిపెద్ద విమాన‌యాన సంస్థ‌గా పేరున్న ఇండిగోలో అత్య‌ధిక క‌రోనా బాధితులు ఉండ‌టం గ‌మ‌నార్హం.  (హైదరాబాద్‌ సహా 13 నగరాలపై సమీక్ష )