https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/migrant%20labour.jpg?itok=a7QNvexK

‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’

పట్నా: వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయని బిహార్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు రంజిత్‌ రంజన్‌ వ్యాఖ్యానించారు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంజిత్‌ రంజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మధుబని, సుపాల్, దర్భాంగా, ముజఫర్‌పూర్, మాధేపురా క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు లేవు. దీని గురించి ప్రశ్నిస్తే.. 9 మంది వలస కార్మికుల మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. బిహార్‌లోని క్వారంటైన్‌ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సరైన వసతులు లేవని అడిగితే వారి మీద కేసు నమోదు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వ చర్యలు చూస్తే.. వలస కార్మికులు ఈ దేశ పౌరులు కారు.. వారికి ఎలాంటి హక్కులు లేవన్నట్లు తోస్తుంది’ అన్నారు‌.(క్వారంటైన్‌లో 23 లక్షల మంది)