https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/ktk.jpg?itok=6_FHE-Si
కర్ణాటక బ్యాంక్‌

ఈఎంఐ కట్టనందుకు ఏడు రెట్ల జరిమానా



కర్ణాటక ,హుబ్లీ: ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇచ్చి కర్ణాటక బ్యాంక్‌ వినియోగదారుని నుంచి పరోక్షంగా దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి. ఆ బ్యాంక్‌ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగినందుకు ఒకే నెలలో ఏడు రెట్ల జరిమానా విధించి సదరు బ్యాంకు వినియోదారున్ని నిలువునా వేధించింది. బాధితుడు సంగమేష్‌ హడపద తెలిపిన వివరాల మేరకు తమ సెలూన్‌ షాపు బంద్‌ అయినందు వల్ల ఈఎంఐ చెల్లించలేకపోయానన్నాడు.(మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్‌!)

ఒక్క నెల ఈఎంఐ జాప్యం చేయడంతో రూ.590లు చొప్పున బ్యాంక్‌ మొత్తం ఏడు రెట్లు రూ.4150లను వసూలు చేసిందని వాపోయాడు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ అడిగితే ఉదాసీనంగా జవాబు చెప్పారన్నారు. బజాజ్‌ ఫైనాన్స్‌లో రూ.30 వేలు రుణం తీసుకొన్న సంగమేష్‌ ప్రతి నెల రూ.3 వేలు ఈఎంఐ చెల్లించేవారు. ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేస్తూ కేంద్రం ఆదేశాలు ఉన్నా బ్యాంకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో బతుకుబండిని సాగించడమే కష్టమైందని బ్యాంక్‌ మేనేజర్‌కు వివరించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని బాధితుడు పేర్కొన్నాడు.