https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/varma.jpg?itok=aVgXgoYj

కరోనా మందు

‘అ!, కల్కి’ చిత్రాలతో ఆకట్టుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తన తదుపరి సినిమా కథాంశంగా కరోనా వైరస్‌ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారు ప్రశాంత్‌. ‘కరోనా వ్యాక్సిన్‌’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. టైటిల్‌ని బట్టి చూస్తే కరోనా వైరస్‌కి మందు కనుగొన్నట్టు ఈ సినిమాలో చూపిస్తారని ఊహించవచ్చు. ఇందులో నటించబోయేది ఎవరు? ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు? వంటి విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌.