కిలాడీ?
ఏ పనినైనా పూర్తి చేయడం కోసం మాయ చేసి, మంత్రం వేసి, మోసం చేసేవాళ్లను కిలాడీ అంటారు. ఇప్పుడు అలాంటి జగత్ కిలాడీగా మారబోతున్నారట రవితేజ. ‘వీర’ తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఇద్దరు కథనాయికలు ఉన్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్ అని చిత్రబృందం కన్‌ఫర్మ్ చేసింది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర పోలీస్ ఆఫీసర్ అట. ఇంకోటి కిలాడీ పాత్ర అని సమాచారం. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.