https://www.prabhanews.com/wp-content/uploads/2020/03/andhra-prabha-logo-2-2.jpg

కాకాని శివాలయం లో మహిళా ఉద్యోగిని సస్పెండ్

క్రిమినల్ కేసు నమోదు చేయాలని పాలక మండలి సభ్యులు తీర్మానం

కాకాని శివాలయం లో మహిళా ఉద్యోగిని హుండీ లెక్కింపు సమయంలో చేతివాటానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ లో నిర్ధారణ కావడంతో ఆలయ ఉద్యోగి కె.నిర్మల రాణి ను విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ దార్ల సుబ్బారావు తెలిపారు. శుక్రవారం ఏసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీ సుబ్బారావు మాట్లాడుతూ మంగళవారం ఆలయంలోని రాహు కేతు మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది అన్నారు . లెక్కింపు విధుల పర్యవేక్షణ లో పాల్గొన్న ఆలయ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ నిర్మల రాణి కొంత డబ్బును తీసుకొని వెళ్లి తనకు కేటాయించిన బీరువాలో దాచి పెట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టం గా కనపడటంతో ఆమెను విధుల నుండి తొలగించడం జరిగిందని పేర్కొన్నారు . క్రిమినల్ కేసు నమోదు చేయాలని శుక్రవారం పాలక మండలి సభ్యులు తీర్మానించారు. తదుపరి విచారణ చేయుటకు పెదకాకాని పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు పాలక మండలి చైర్మన్ బొంతు శివారెడ్డి తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ నిర్మల రాణి పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని ఎస్ఐ అనురాధ తెలిపారు.