https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/32-1.jpg

‘మా’ దారి గోదారేనా..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏవైనా సమస్యలు వస్తే ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) చూసుకుంటుంది. అలానే ముందుండి ఇండస్ట్రీలోని అందరిని కలుపుకొనిపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అయితే ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి ‘మా’ ని పక్కన పెట్టి తనే మీటింగులు ఏర్పాటు చేయడంపై అందరూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి సంభందించిన సమావేశాలు తెలుగు ఫిలిం ఛాంబర్ లో కండక్ట్ చేస్తుంటారు. కానీ చిరు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి తన నివాసంలో మీటింగ్ పెట్టాడని.. ఆ మీటింగ్ కి కూడా కొంతమందిని మాత్రమే పిలిచి మిగతా వారిని కావాలనే పక్కన పెట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో కాకుండా తన ఇంట్లో సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ‘మా’ ని కాదని మరో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినీ ఆర్టిస్టుల కోసం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంటుగా అక్కినేని నాగేశ్వరరావు చీఫ్ అడ్వైజర్ గా ఏర్పాటైంది. మరి ఆయన ఫౌండర్ గా ఉన్న ‘మా’ ని కాదని చిరు ఎందుకు సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ ‘మా’లో చిచ్చుపెట్టి సొంత డబ్బా కోసం ఇంకొకటి పెట్టి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని.. అందుకోసం కావాలనే కొంతమందిని ఇండస్ట్రీలో దూరం పెడుతున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.