https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/vvvv-1-678x381.jpg

కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచి పెద్ద ఎత్తున అవగాహన కల్పించండి

కర్నూలు,  కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచి.. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కరోనా వ్యాప్తి నివారణ మార్గాలు, కరోనా లక్షణాలు పరీక్ష – చికిత్స కట్టడి చర్యలపై పెద్ద ఎత్తున ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ దిశానిర్దేశం ఇచ్చారు.

శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ వారి బంగ్లా కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ కరోనా కట్టడి చర్యలు.. ఇంటింటికి కరపత్రాల పంపిణీ.. అవగాహన కార్యక్రమాలతోపాటు కరోనా టెస్టులు తదితర విషయాలపై మండల స్థాయి అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ లు, వర్టికల్ నోడల్ ఆఫీసర్ లు, మెడికల్ ఆఫీసర్ లతో టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, గ్రామ, వార్డు సచివాలయ వాలంటరీలు, ఏఎన్ఎంలు ఈ రోజు పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి నివారణ మార్గాలు కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ కరోనాపై ప్రజల్లో ఉన్న భయాన్ని ఆందోళనను తొలగిస్తూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఐదో విడత ఇంటింటికి నిర్వహించే ఫీవర్ సర్వేలో జియో ట్యాగింగ్ చేసి సర్వేలో అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఉంటే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు వెంటనే చేపట్టాలన్నారు. అర్బన్ ఆసుపత్రి, కమ్యూనిటీ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక వైద్య కేంద్రాలలో కచ్చితంగా కరోనా శాంపుల్ కలెక్ట్ చేయాలన్నారు. ప్రతి మెడికల్ ఆఫీసర్ రోజుకు కచ్చితంగా 50 శాంపుల్ కలెక్ట్ చేయాలన్నారు. ఆన్ లైన్ లో ఆరోగ్య సేతు యాప్, ఫార్మసీ లలో అనుమానిత లక్షణాలు ఉన్న వారి డేటాను సేకరించి వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. నాన్ కోవిడ్ సర్వీస్ ఎక్కడ డిస్ట్రబ్ కాకుండా చూసుకోవాలని డి ఎం హెచ్ ఓ కు కలెక్టర్ సూచించారు. కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులందరూ అత్యంత అప్రమత్తతో ప్రజలు స్వీయ నియంత్రణ, మాస్క్, సామాజిక దూరం పాటించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కరోనా శాంపిల్స్ శిక్షణ తీసుకున్న మెడికల్ ఆఫీసర్లు తమ వైద్య ఆస్పత్రులలో వెంటనే కరోనా శాంపిల్స్ కలెక్ట్ చేయాలన్నారు.

అనంతరం జే సి 2 రామ సుందర్ రెడ్డి కరోనా కట్టడి కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్, టెస్టులు, ఐదో విడత ఫీవర్ సర్వే, దోమల వ్యాప్తి నివారణ చేసేందుకు పాగింగ్, పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శాంపిల్స్ కలెక్ట్ చేసేందుకు గుర్తించిన ప్రవేటు బిల్డింగ్ లో సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు గుర్తించి శాంపిల్స్ కలెక్ట్ చేయాలన్నారు.

అదేవిధంగా కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి కే బాలాజీ,  డి ఎం హెచ్ వో రామ గిడ్డయ్య, డిఆర్డిఏ పిడి శ్రీనివాసులు, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పిడి మురళి తదితరులు టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్షించారు.