https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/yttt-560x381.jpg

తనిఖీలో చిక్కిన దొంగ

భద్రాచలం పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ దొంగ దొరికాడు.వివరాలు ఇలా శుక్రవారం ఉదయం 08.00 గంటలకు సాయిబాబా గుడి సెంటర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో చెన్నం వంశీధర్ రెడ్డి  అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు విచారణ లో తాను జనవరి నుండి అంబా సత్రం వీధి నందు ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిపాడు. పోలీసులు తమదేనా శైలిలో ప్రశ్నించగా గత మూడు నెలల క్రితం భద్రాచలంలోని తాతగుడి సెంటర్ వద్ద గల బొల్లోజు సూర్య భగవాన్   ఇంట్లో మరియు అంబా సత్రం వీధి నందు గల దిలీప్  ఇంట్లో బంగారు నగలను దొంగిలించానాని అట్టి నగలను కొత్తగూడెం నందు అమ్ముటకు తీసుకు వెళుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు . భద్రాచలం టౌన్ పోలీసు వారు వాహన తనిఖీ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది మరియు అతని వద్ద గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోనైనది. ఇతని వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు మూడు లక్షల రూపాయల గా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వినోద్ మాట్లాడుతూ భద్రాచలం ప కొత్త వ్యక్తులు ఇంట్లోకి దిగే సమయంలో వారి వద్ద సరైన గుర్తింపు కార్డులు తీసుకొని ఇల్లు అద్దెకు ఇవ్వాలని తెలిపారు.