https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/31-2.jpg

ఫస్ట్ టైం చార్ట‌ర్డ్ ఫ్లైట్ లో వలస కూలీలు..

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక‌మైన బ‌స్సుల ద్వారా వలస  కూలీల‌ని వారి స్వస్థాలలకు  పంపిన నటుడు సోనూసూద్  తాజాగా చార్ట‌ర్డ్ ఫ్లైట్ ద్వారా 151 మంది మ‌హిళా కూలీల‌ని వారి సొంత ఊర్ల‌కి పంపారు. ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌కి  చెందిన మ‌హిళా కూలీలు త‌మ ఉద్యోగాల‌కి రాజీనామా చేసి ఇళ్ళ‌కి వెళ్ళేందుకు సిద్ధ‌ప‌డ్డారు. కొచ్చి నుండి భువ‌నేశ్వ‌ర్ వెళ్లేందుకు ర‌వాణా వ్య‌వ‌స్థ స‌రిగా లేని ప‌రిస్థితుల‌లో ప్ర‌త్యేక చార్ట‌ర్డ్ ఫ్లైట్ ద్వారా వారంద‌రిని స్వ‌స్థ‌లాలకి పంపారు. కేఐటీఈఎక్స్ గార్మెంట్స్ లో ప‌ని చేసే 151 మందితో పాటు బ‌వ వుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన 9 మందిని కూడా సేమ్ ఫ్లైట్‌లో పంపారు. తొలిసారి మ‌న దేశంలో వ‌ల‌స కార్మికుల‌ని ఫ్లైట్ ద్వారా పంపిన ఘ‌న‌త సోనూసూద్‌కి ద‌క్కింది.