https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/34.jpg

కొత్త చిత్రం టైటిల్ లీక్ పై ‘మహేష్’ గరం గరం..

‘సీనియర్ నటుడు  సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా  మహేష్ బాబు 27వ చిత్రానికి  పూజా కార్యక్రమాలు జరుగుతాయని.. అదే రోజు అభిమానులకు కానుకగా టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేయాలని దర్శకుడు  పరశురామ్ టీమ్ ప్లాన్ చేసుకున్నారట.  టైటిల్ ప్రకటనతో అభిమానులను థ్రిల్ చేయాలని అనుకుంటే అది కాస్తా ముందే లీక్ కావడంతో మహేష్ అప్సెట్ అయ్యాడట. ‘సర్కార్ వారి పాట’ టైటిల్ ఖాయం అయిందని సమాచారం.  ఐతే ముందే ఇది మీడియాకు ఎలా లీక్ అయిందని మహేష్ తన పీఆర్ టీమ్ పై అసహనం వ్యక్తం చేశాడని టాక్. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెప్పారట. ఇప్పుడు టైటిల్ లీక్ అయిపోయింది కాబట్టి సినిమా టైటిల్ పోస్టర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారట.