కళాజాత ద్వారా కరోనా నియంత్రణపై అవగాహన
నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజి గారి ఆదేశాల మేరకు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో కరోనా వ్యాపిని నియంత్రించేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, వాటి ఆవశ్యకత గురించి కళాకారులు తమ ఆట, పాట ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక సి.క్యాంప్, శ్రీరామ్ నగర్, మద్దూర్ నగర్ ప్రాంతాల్లో కరోనా నివారణకు జరుగుతున్న కళాజాతను నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజి గారు పరిశీలించారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ జాగ్రత్తలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రతపై క్షుణ్ణంగా అవగాహన కల్పించాలని కళాకారులకు తెలియజేశారు.