https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/37.jpg

టాట్టూ పోయిందే..

బాలీవుడ్ నటుడు  రణబీర్ కపూర్  నుంచి విడిపోయి ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ ని దీపికపదుకొనే  పెళ్లాడినా ఇంకా తన మనసులో రణబీరే ఉన్నాడని అభిమానులు నమ్ముతారంటే ఆ జంట లవ్ స్టోరీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక రణబీర్ కపూర్ (ఆర్.కే)తో నిండా ప్రేమలో మునిగి ఉన్నప్పుడు ఆర్.కే అంటూ రెండక్షరాల్ని తన మెడ వెనక భాగంలో పచ్చబొట్టు (టాట్టూ) పొడిపించుకుంది. అది ఎప్పటికీ చెరగని శాశ్వత టాట్టూ. దాంతో రణవీర్ సింగ్ ని పెళ్లాడినా కానీ అది చెరిగిపోలేదు. దానిపైనా ఫోటో ఆధారాలతో అప్పట్లో మీడియాలో బోలెడన్ని కథనాలు వేడెక్కించాయి.
కానీ కాలక్రమంలో ఆ టాట్టూ మాయమైంది. ఇటీవలే  `చపాక్` రిలీజ్ ప్రమోషన్స్ కి వెళ్లినప్పుడు బ్యాక్ లెస్ ఫోజులో కనిపించిన దీపిక మెడపై పరిశీలిస్తే అక్కడ ఆ టాట్టూ కనిపించలేదు. ఇంతకీ ఆ టాట్టూని ఎలా చెరిపేయగలిగారు అని బాలీవుడ్ మీడియా ప్రశ్నిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా గుర్రుగా ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి వైపు కెమెరా వైపు చూస్తూ ఉండిపోయిందట. ఇక ఆ శాశ్వత టాట్టూ చెరిగిపోలేదని…  అంతా మేకప్ జిమ్మిక్ అని సోషల్ మీడియాల్లో డిబేట్లు నడిచాయి.