నీటి శుద్ధి కేంద్రాలు ఎంతో ఉపయుక్తం
కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో పనిచేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు తప్ప మరింత ఉపయుక్తంగా వివిధ రకాల పనులకు ఉపయోగించేలా కార్యాచరణ కార్యాచరణ సిద్ధం చేయాలని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక సుంకేసుల రోడ్డులో పంప్ హౌస్ వద్ద ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. మురుగునీటిని ఎన్ని దఫాలుగా శుద్ధి చేస్తారు?, ఇందుకు ఎలాంటి రసాయనాలు ఉపయోగిస్తారు, వాటి ప్రమాణాలు గురించి నగర పాలక ఏఈ హరికృష్ణ కమిషనర్ గారికి వివరించారు. ప్రస్తుతం ఉన్న 2.5 ఎం.ఎల్.డి సామర్ధ్యం ద్వారా నగరంలోని రహదారుల విభాగినులపై ఉన్న మొక్కలకు ఈ నీటిని ఉపయోగిస్తున్నట్లు ఏఈ తెలియజేశారు. ఈ మేరకు కమిషనర్ బాలాజీ గారు మాట్లాడుతూ.. ప్రతి రోజు శుద్ధి చేసిన నీటిని నిర్దిష్ట ప్రణాళికతో పరీక్షించాలన్నారు. అనంతరం అక్కడే మురుగునీరు తుంగభద్ర నదిలోకి వెళ్లకుండా డ్రైన్ ను నిర్మించేందుకు స్పష్టమైన ప్లాన్ రూపొందించాలని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి నగరానికి చుట్టూ నిర్మాణం జరిగే రింగ్ రోడ్డులో పర్యటించారు. అక్కడక్కడా చదును చేసిన భూమిపై మొదట గ్రావెల్ రోడ్డు నిర్మాణం అవసరమని కమిషనర్ తెలియజేశారు.