ఉత్తర భారతంలో వేడిగాల్పులు
న్యూఢిల్లీ : ఒక వైపు కరోనా బెంబేలెత్తిస్తోంటే..మరోవైపు ఎండలు మండుతున్నాయి. ఉత్తరభారత్‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాల్పులు దడ పుట్టిస్తున్నాయి. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది 26న ఢిల్లీలో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆరు డిగ్రీలు పెరిగి గరిష్టంగా 48 సెల్సియస్ డిగ్రీలకు చేరుకుంది. దేశ రాజధాని 18 ఏళ్లలో ఇంత ఎండనూ ఎన్నడూ చూడలేదు. మే 21న మొదలైన ఉత్తర-పశ్చిమ గాలుల కారణంగా వేడిగాల్పులు మొదలై..వేడి వాతావరణం పెరుగుతోంది. సహజ ప్రమాదాలకు ఈ వేడి గాల్పులు కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల 21వ శతాబ్దంలో దీని తీవ్రత పెరుగుతోంది.