http://www.prajasakti.com/./mm/20200529//1590737279.migrant-workers.jpg

అలాంటి వారు రైళ్లలో ప్రయాణించొద్దు

        న్యూఢిల్లీ : గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, రైళ్లు ఎక్కకూడదని రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. వైద్య సేవలు పొందుతున్న వ్యక్తులు ప్రయాణాలు చేయొద్దని కోరింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హైపర్‌ టెన్ష్‌న్‌, మధుమేహం, కేన్సర్‌, హృద్రోగ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రైళ్లలో ప్రయాణాలు చేయరాదని ప్రకటనలో పేర్కొంది. వసల కార్మికుల కోసం శ్రామిక్‌ రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్న సంగతి తెలిసిందే.. అయితే కొన్ని రోజులుగా పలువురు ఈ రైళ్లలో మరణించారు. వారిలో చాలా మంది ముందుగానే అరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.