భారత్-ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పూర్తి పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబరులో టీమిండియా అక్కడికి వెళ్లనుంది. మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడబోతోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తాజాగా పూర్తిస్థాయి షెడ్యూల్‌ని ప్రకటించింది. అక్టోబరు 11న బ్రిస్బేన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత డిసెంబరు 3 నుంచి టెస్టు సిరీస్. 2021 జనవరి 12 నుంచి వన్డే సిరీస్ మొదలవనుంది. వాస్తవానికి అక్టోబరు 18 నుంచి ఆస్ట్రేలియా వేదికగానే టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వాయిదావేయడం దాదాపు ఖాయమవడంతో భారత్ పర్యటనను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసింది.
టీ20 సిరీస్ షెడ్యూల్ :
* అక్టోబరు 11న బ్రిస్బేన్ వేదికగా తొలి టీ20
* అక్టోబరు 14న కాన్‌బెర్రా వేదికగా రెండో టీ20
* అక్టోబరు 17న అడిలైడ్ వేదికగా మూడో టీ20
టెస్టు సిరీస్ షెడ్యూల్ :
* డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్‌లో తొలి టెస్టు
* డిసెంబరు 11 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు (డే/నైట్)
* డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు)
* 2021, జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు
వన్డే సిరీస్ షెడ్యూల్ :
* జనవరి 12 నుంచి పెర్త్ వేదికగా తొలి వన్డే
* జనవరి 15 నుంచి మెల్‌బోర్న్ వేదికగా రెండో వన్డే
* జనవరి 17 నుంచి సిడ్నీ వేదికగా మూడో వన్డే