http://www.prajasakti.com/./mm/20200529//1590762376.Thierry-Delaporte.jpg

విప్రోకు తొలి విదేశీ సిఇఒ

కొత్త సారథిగా థియర్రీ డెలాపోర్ట్‌

బెంగళూరు : అజీం ప్రేమ్‌జీకి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో లిమిటెడ్‌కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా థియర్రీ డెలాపోర్ట్‌ నియమితులయ్యారు. ఇంతక్రితం ఆయన క్యాప్‌జెమిని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సిఒఒ)గా పని చేశారు. థియర్రీ క్యాప్‌జెమినీలో కంపెనీలో దాదాపు 25ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వహించిన సుదీర్ఘ అనుభవం ఉంది. విప్రో ప్రస్తుత సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అబిదాలీ నీముచ్‌వాలా జూన్‌ 1న పదవి నుంచి వైదొలగనున్నారు. ఆ తర్వాత రషీద్‌ ప్రేమ్‌జీ జులై 5 వరకు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను చూడనున్నారు. జులై 6న డెలాపోర్ట్‌ విధుల్లో చేరనున్నారు.